మాదాపూర్, ఏప్రిల్ 4: ‘మా లక్ష్యం కేవలం డిగ్రీలు ఇవ్వడం మాత్రమే కాదు, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ధైర్యవంతులైన వృత్తి నిపుణులను తీర్చిదిద్దడం’ అని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు లక్ష్మణ్ అన్నారు. కొండాపూర్లోని కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్లో విద్యార్థులు సాధించిన అద్భుతమైన ఉద్యోగ విజయాలను పురస్కరించుకొని శనివారం ఏర్పాటు చేసిన విజయోత్సవ సమావేశానికి యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు లక్ష్మణ్ హాజరై అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్లర్ డాక్టర్ జి.పార్థసారధి వర్మ తదితరులు తెలిపారు.