హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణేశుడి (Khairatabad Ganesh) శోభాయాత్ర ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళాలతో లంబోధరుడి శోభాయాత్ర (Shobha yatra) కొనసాగుతున్నది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బడా గణేశ్ గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత శుక్రవారం రాత్రి 12.35 గంటలకు పూజారులు కలశాన్ని కదిలించారు. తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు గణేశుడికి భారీ గజమాల అలంకరించి హారతులు సమర్పించారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. దీంతో వడివడిగా ట్యాంక్ బండ్ వైపు కదులుతున్నాడు.
రాజ్‌ధూత్ హోటల్, టెలిపోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్‌బండ్ చేరుకుంటాడు. ఎన్టీఆర్ మార్గ్‌లో నాలుగో నంబర్ స్టాండులో నిమజ్జనం చేయనున్నారు. దీంతో అక్కడ బాహుబలి క్రేన్‌ను ఏర్పాటు చేశారు. మహాగణపతి శోభాయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. నిమజ్జన కార్యక్రమంలో సుమారు 10 లక్షల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నది.