Ganesh Chaturthi | సిటీబ్యూరో: వినాయకచవితి సమీపిస్తుండటంతో నగరంలో వినాయక ప్రతిమలు విభిన్న రూపాల్లో అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. కొన్ని చోట్ల విగ్రహాల విక్రయాలూ జోరందుకున్నాయి. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ గణేశుడు.. 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో భక్తులకు కనువిందు చేయనున్నాడు.
ఈ నేపథ్యంలో విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా..వచ్చే నెల 7న వినాయక చవితితో ప్రారంభమయ్యే వేడుకలు 17న నిమజ్జనంతో ముగుస్తాయని సీపీ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మండపాలను ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా స్థానిక ఏసీపీల నుంచి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఏర్పాట్లు, నిమజ్జనానికి సంబంధించిన సర్టిఫికెట్లు తీసుకోవాలని, ఇందుకు హైదరాబాద్ పోలీస్.జీవోవీ. ఇన్, పోలీస్ పోర్టల్. టీఎస్పోలీస్.జీవోవీ. ఇన్ వెబ్సైట్ల నుంచి ఫారాలు పొందవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు 8712665785 నంబర్లో సంప్రదించాలన్నారు.