సిటీ బ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లోంచి కేసీఆర్‌ను చెరిపేయలేరని ఓ మూగ మహిళ చెప్పింది. తనకు మాటలు రాకున్నా సైగలతో గుండెల నిండా కేసీఆర్ సారే ఉన్నారని తేల్చి చెప్పింది. పదేండ్లలో కేసీఆర్ చేసిన మంచి పనులను గుర్తు చేసింది.
కేసీఆర్ ఇచ్చిన రూ.4000 పింఛనే వస్తున్నదని, కాంగ్రెసోళ్లు రూ.6000 ఇస్తానని మోసం చేశారని వాపోయింది. మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెబుతామని స్పష్టం చేసింది. కారు గుర్తుకే ఓటేస్తానని తేల్చి చెప్పింది. మాటలు రాకున్నా కేసీఆర్‌పైన ఉన్న అభిమానాన్ని చాటుకుంది. ఆమె అభిమానానికి ప్రజలంతా ఫిదా అవుతున్నారు.