అబిడ్స్ ఏప్రిల్ 29: గత పాతికేళ్లుగా పాతబస్తీ సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ అందరి మన్ననలు పొందుతూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ఉప్పుగూడ నివాసి, ప్రముఖ సంఘ సేవకులు కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్‌కు ఉగాది శ్రమశక్తి అవార్డు 2025 ప్రదానం చేశారు. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో థియేటర్స్ వెల్పేర్ అసోసియేషన్ నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నాయకులు పల్లె లక్ష్మణ్ గౌడ్, తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ఈ పురస్కారాన్ని అందజేశారు.
గత 25 సంవత్సరాలుగా పాత బస్తీ వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ నిధులను మంజూరు చేయించి శ్యామ్‌రావు అందరి మన్ననలు పొందారు. గతంలో మదర్ థెరిసా స్మారక అవార్డు, మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కార్‌తో పాటు మరెన్నో అవార్డులను అందుకున్నారు.