పెంపుడు జంతువుల వెంట్రుకలను తొలగించడంలో లింట్ రోలర్ సమర్థంగా పనిచేస్తుంది. ముఖ్యంగా.. సోఫాలు, దుస్తులు, బెడ్‌పైన అత్యంత సులభంగా శుభ్రం చేసేస్తుంది. దీనికుండే జిగురుకు చిన్నచిన్న వెంట్రుకలు కూడా అతుక్కుపోతాయి.
గచ్చుపైన పడే వెంట్రుకల్ని మామూలు చీపురు తొలగించలేదు. ఇందుకోసం మైక్రోఫైబర్ మాప్/ వస్ర్తాన్ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
దుస్తుల్ని ఉతికేటప్పుడు వాషింగ్ మెషిన్లో డ్రైయర్ షీట్స్ వాడాలి. అప్పుడు జుట్టు వస్ర్తాలకు అంటుకోకుండా విడిపోతుంది.