దుండిగల్, అక్టోబర్ 28: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కాసాని వీరేశ్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని బాచుపల్లిలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ జిల్లాలకు సంబంధించిన సభ్యులు పాల్గొని తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జగన్మోహన్ వ్యవహరించిన ఈ ఎన్నికలకు ఇండియన్ ఒలింపిక్ సంఘం ఏకేఎఫ్ఐ సభ్యులు అబ్జర్వర్లుగా వ్యవహరించగా అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా కాసాని వీరేశ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి, కోశాధికారిగా రవితో పాటు ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నుకైన కాసాని వీరేశ్ ముదిరాజు మాట్లాడుతూ, తనను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి తనకు సేవ చేసే అదృష్టాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కోచ్‌ల రెగ్యులరైజేషన్ సమస్య 32 ఏండ్లుగా ఉన్నప్పటికీ వారు పర్మిట్ కాకపోవడం శోచనీయమని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కోచ్‌ల అసోసియేషన్ అధ్యక్షురాలు సత్యవాణి ఆవేదన వ్యక్తం చేశారు. లాల్ బహుదూర్ స్టేడియంలోని ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దీర్ఘకాలంగా పుండింగ్లో ఉన్న తమ కోచ్‌ల సమస్యను వెంటడే పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కోచ్‌లుగా బాధ్యతలను నిర్వహిస్తున్న 187 మంది కోచ్‌లను వెంటడే పర్మినెంట్ చేయాలని సంఘం డిమాండ్ చేసింది.