ఘట్కేసర్,జనవరి9: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2వ విడుత కంటి వెలుగు కార్యక్రమ ఫలితాలు ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు చొర వ చూపాలని పోచారం చైర్మన్ బి.కొండల్‌రెడ్డి సూచిం చారు. సోమవారం మున్సిపాలిటీ కార్యాలయంలో కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ కంటి చూపు సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనతో రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి కండ్లను పరీక్షించి ఉచిత కండ్ల అద్దాలు, మందులను అందజేస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమం పై కౌన్సిలర్లు శ్రద్ధ వహిం చి ప్రజలకు అవగాహన కల్పించి విజయవంతం చేయాలని సూచించారు.ముఖ్యంగా ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ దవాఖానల ఆధునీకరణ, వైద్యులు,సిబ్బంది నియామకం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమిషనర్ సురేశ్,కౌన్సిలర్లు,బీఆర్ఎస్నాయకులు పాల్గొన్నారు.
ఘట్కేసర్లో…
ఈనెల 18 నుంచి నిర్వహించే కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపాలిటీలో విజయవంతం చేయాలని ఘట్కేసర్ మున్సిపల్ సమావేశంలో నిర్ణయించారు. ఇందు కోసం కౌన్సిలర్లు స్థానిక ప్రజలను చైతన్యం చేసి కంటి వెలుగు కార్యక్రమానికి తరలించాలని నిర్ణయించారు.
దమ్మాయిగూడలో…
మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 9 :కంటి వెలుగును విజయవంతం చేయాలని చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు.దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం లో ప్రణీత ఆధ్యక్షతన కంటి వెలుగుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 18 నుంచి కంటి వెలుగు మొదలైవుతుందని, మున్సిపాలిటీ పరిధిలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ స్వామి, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మేనేజర్ వెంకటేశం, కౌన్సిలర్లు నానునాయక్, సుజాత, వెంకటేశ్, స్వప్న, అనురాధ, శ్రీహరిగౌడ్, రమేశ్‌గౌడ్, వెంకటేశ్, కో-ఆప్షన్ సభ్యులు బేగం, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్‌లో..
జవహర్‌నగర్, జనవరి 9: కంటి వెలుగు కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని మేయర్ మేకల కావ్య సూచించారు. సోమవారం కార్పొరేషన్‌లోని డ్వాక్రా భవన్లో మేయర్ కావ్య అధ్యక్షతన కంటి వెలుగు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు పథకం ప్రవేశపెట్టిందని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామలింగం, డాక్టర్ పద్మావతి, మున్సిపల్ డీఈ బాల మురళి, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్పీలు, ఆశవర్కర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.