రవీంద్రభారతి, సెప్టెంబర్ 5 ఃరాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ధన్వంతరి ఇంటర్నేషనల్ సంస్థ (డీఎఫ్ఐ) ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలని ధన్వంతరి అగ్రిప్ట్ అన్వెస్టర్స్ అసోయేసిషన్ (డీఏఐ) కోరింది. ఈ మేరకు శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఏఐ అధ్యక్షుడు అన్నం రాజు నాగరాజు, మాజీ అధ్యక్షుడు ఆత్రేయశర్మ, సెక్రటరి అచ్యుతనంద రంగారావు, వైస్ ప్రెసిడెంట్, ఎస్.నర్సింహామూర్తిలు మాట్లాడుతూ బాధితులకు అనుకూలంగా నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించిందని, తీర్పు అనుకూలంగా రావడానికి కృషిచేసిన డీసీపీ శ్వేతా, ఏసీపీ ఆది నారాయణరావులకు కృతజ్ఞతలు తెలిపారు. సీసీఎస్ అఫీసర్స్కు సలహాల మేరకు ఈ అసోసియేషన్ స్థాపించామని చెప్పారు.
డీఎఫ్ఐ సంస్థల పెట్డుబడి పెట్టి మోసపోయిన వివిధ సంస్థలను, వ్యక్తలను ఒక తాటిపైకి తీసుకొచ్చి 400 మంది సభ్యులతో అసోసియేషన్ ఏర్పడిందని వివరించారు. 1700 మంది బాధితులు 220కోట్ల పైగా పెట్టుబడులు పెట్టి మోసపోయామని చెప్పారు. ఇందులో చాలా మంది వృద్ధులని పేర్నొన్నారు. ఎన్నో ప్రయాసలకు ఓర్చి దాచుకున్న సొమ్మును అధిక వడ్డీ ఆశపడి డీఎఫ్ఐలో పెట్టుబడి పెట్టి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ధన్వంతరి సంస్థ వారు బాధితలతో సామరస్యపూర్వకంగా పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని కోరింది. బాధితులకు మూలధనంతోపాటు వడ్డీ సొమ్మును చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.