హైదరాబాద్,ఆగస్టు 5 : రాష్ట్రంలో ప్రజాహితం కోసం పోలీసు వ్యవస్థ కృషి చేయాలని రాష్ట్ర పోలీసు కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్ జస్టిస్ బీ శివశంకర రావ్ (Justice B Shiva Shankar Rao) అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని బీఆర్కే భవన్(BRK Bhavan)లోని పోలీసు కంప్లైంట్స్ అథారిటీ కార్యాలయంలో అథారిటీ చైర్మన్, సభ్యులను హోం శాఖ కార్యదర్శి రవి గుప్తా, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్, అడిషనల్ డీజీపీ(లా అండ్ ఆర్డర్) మహేష్ ఎం. భగవత్లు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా పోలీస్ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను సవరించి.. ప్రజహితం వైపు పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడం కోసం అవసరమైన పలు విషయాలు చర్చించారు. ఈ కార్యక్రమంలో అథారిటీ రాష్ట్ర సభ్యులు పి. ప్రమోద్ కుమార్, డాక్టర్. వర్రె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.