హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రమాణం స్వీకరించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సీజేతో ప్రమాణం చేయించారు. అనంతరం కొత్త సీజేకు గవర్నర్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.