సుల్తాన్‌బజార్, మే 26 : లాడ్జిలో జూనియర్ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురంకు చెందిన అనిల్‌కుమార్ ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రస్తుతం జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ నెల 22న అఫ్జల్‌గంజ్‌లోని పెరల్ లాడ్జిలో 208 గదిని అద్దెకు తీసుకొని నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నాడు.
కాగా గురువారం ఉదయం లాడ్జిలో గదులను శుభ్రపరిచే క్రమంలో రూమ్‌బాయ్ తలుపుతట్టగా తీయలేదు. వెంటనే లాడ్జి నిర్వాహకులకు సమాచారం అందించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా లాడ్జికి చేరుకుని తలుపులు పగులగొట్టగా అప్పటికే అనిల్‌కుమార్ మృతిచెంది ఉన్నాడు. మృతదేహం పక్కన ఔషదాలు, ఇంజెక్షన్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. అయితే వైద్యుడి మృతికి గల కారణాలు తెలియరాలేదు.