సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఆకట్టుకునే ఆభరణాలకు నిలయమైన జోయాలుక్కాస్ షో రూం అతి పెద్ద ఆభరణాల సేల్ ను ప్రకటించింది. ఈ ఏడాది జూలై 13 వరకు అన్ని జోయాలుక్కాస్ షోరూంలలో వినియోగదారులకు గోల్డ్, కట్, అన్కట్ డైమండ్స్, ప్లాటినమ్, వెండి, ప్రెషస్స్టోన్ జ్యువెలరీ శ్రేణిలో మజూరీ చార్జీలపై 50 శాతం తగ్గింపును ప్రకటించింది.
జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జాయ్ అలుక్కాస్ మాట్లాడుతూ ఆభరణాల కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారునికి ఆనందదాయకమైన అనుభూతిని మిగిల్చేలా సేవలందించడమే తమ లక్ష్యమని తెలిపారు. అన్ని షో రూంలలో ఈ ఆఫర్ ప్రయోజనాలను పొందవలసిందిగా వినియోగదారులకు సూచించారు. జోయాలుక్కాస్ నుండి చేసిన ప్రతి కొనుగోలుపై వినియోగదారులు జీవితకాలం నిర్వహణ, ఏడాది ఉచిత బీమా, బై బ్యాక్ హామీ పొందుతారని తెలిపారు.