MLA Sudheer Reddy | ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
హయత్‌నగర్, ఆగస్టు1 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హయత్‌నగర్ డివిజన్లోని మహాగాయత్రినగర్ కాలనీలో ముద్దం పరమేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బేడా బుడగ జంగం సభ్యులు దాదాపు 80 మంది ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో తూర్పాటి చిన్న కోటయ్య, శ్రీనివాసులు, కోటయ్య, వెంకటేష్, యాదగిరి, సత్యనారాయణ, రామస్వామితోపాటు పలువురు ఉన్నారు. ఈ కార్యక్రమంలో హయత్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేష్ ముదిరాజ్, సీనియర్ నాయకురాలు మల్లీశ్వరి, భాస్కర్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

