సిటీబ్యూరో, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ):హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యగో విరమణ పొందిన 19 మంది పోలీస్ అధికారులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.సీసీఎస్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సీవీ.ఆనంద్ మాట్లాడుతూ.. తాను ప్రతి రిటైర్మెంట్ ఫంక్షన్‌కు హాజరవుతానని, ఎందుకంటే ఇన్నేళ్లు సర్వీసులో ఉన్నవారు ఉద్యోగ విరమణ పొందుతున్న సందర్భంలో వారికి కృతజ్ఞతలు తెలుపడం తన బాధ్యత అన్నారు.
ఉద్యగో విరమణ పొందిన తర్వాత కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పోలీసుశాఖలో ఈ ఉద్యోగుల సేవలు మరపురానివన్నారు. ఉద్యగో విరమణ పొందిన వారిలో ముగ్గురు ఎస్ఐలు, 13 మంది ఆర్ఎస్ఐ, ఏఎస్ఐలు, ముగ్గురు హెడ్‌కానిస్టేబుల్స్ ఉండగా.. వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ సొసైటీ తరపున సీపీ ఆనంద్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధక్షుడు నల్లశంకర్రెడ్డి, మహ్మద్ ఆసిప్ఖాన్, నవీన్‌కుమార్, జీఎంఎస్ విక్టర్, రత్నకుమారి, ఏఎస్డీ శాంతి, ఎం.కేశవ్, లక్ష్మణ్‌కుమార్, వినీత్, అప్పలసూరి, జనార్దన్‌రెడ్డి, శ్రీశైలంలతో పాటు సిటీ పోలీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.