హైదరాబాద్ : నాంపల్లి అగ్రిప్రమాద ఘటనలో(Nampally fire incident) బిల్డింగ్ సెల్లార్లు పంతొమ్మిది గంటలుగా తగలబడుతున్నాయి. సెల్లార్లకు రంధ్రాలు పడి పొగ పైకి వస్తున్నది. ఈ నేపథ్యంలో నాంపల్లికి జేఎన్టీయూ ఇంజినీరింగ్ నిపుణులబృందం రానుంది. ప్రమాద తీవ్రతను పరిశీలించనున్నారు. భవనాన్ని తనిఖీ చేసి ప్రభుత్వానికి ఇంజినీరింగ్ నిపుణుల బృందం నివేదిక ఇవ్వనుంది.
కాగా, నాంపల్లిలో సహాయక చర్యలకు దట్టమైన పొగ ఆటంకంగా మారింది. భవనంలో చిక్కున్న ఆరుగురిని రక్షించేందుకు రెస్క్యూ టీంలు ప్రయత్నిస్తున్నాయి. సెల్లార్ అంతా ఫర్నీచర్ పరిచి ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతున్నది. ప్రమాద ఘటపై ఎస్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ కట్టడాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడింది.