తెలంగాణ లీడర్షిప్ అవార్డ్స్ 2024లో భాగంగా జయశ్రీ టెక్నో సొల్యూషన్స్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డు గెలుచుకుంది. హైదరాబాద్ బేగంపేటలో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎంప్లాయిర్ బ్రాండింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ వరల్డ్ హెచ్ఆర్డీ కాంగ్రెస్ సంయుక్తంగా ఈ అవార్డును ప్రదానం చేశాయి.
ఈ సందర్భంగా ఉద్యోగుల అభివృద్ధి, వినూత్నత, ఆదర్శవంతమైన మానవ వనరుల విధానాల కోసం జయశ్రీ టెక్నో సొల్యూషన్స్ సంస్థ చేస్తున్న కృషిని నిర్వాహకులు అభినందించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఫణి కిశోర్ చిలుకూరి మాట్లాడుతూ.. “మా ఉద్యోగుల పట్ల మేము కట్టుబడి ఉన్న నిబద్ధతకు ఈ గుర్తింపు సాక్ష్యంగా నిలుస్తోంది. ఉద్యోగుల్లో ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పడానికి చేసిన కృషికి ఈ పురస్కారం లభించడం మాకు గౌరవంగా ఉంది.” అని అన్నారు.
ఈ విజయానికి తమ ఉద్యోగుల నిబద్ధత, విశ్వాసం ప్రధాన కారణమని ఫణి కిశోర్ చిలుకూరి తెలిపారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాల్లో నైపుణ్య ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.