Spoorthi Reddy | మణికొండ, ఆగస్టు 24 : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని జలమండలి కార్యాలయంలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఇటీవల ఓ నల్లా కనెక్షన్ కోసం రూ.30 వేలు లంచం తీసుకుంటూ..
రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన స్ఫూర్తిరెడ్డి సస్పెండయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎస్. నవీన్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించారు.