సిటీ క్రిమినల్ కోర్టు, నాంపల్లి, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి నాంపల్లి ప్రత్యేక పొక్సో కోర్టు 25 ఏండ్ల జైలు శిక్ష, 4 లక్షల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గా జీ బాధితురాలి తరఫున వాదించగా, సుదీర్ఘంగా సాగిన ఈ కేసు విచారణలో సాక్షులందరిని విచారించిన నాంపల్లి ప్రత్యేక పొక్సో కోర్టు న్యాయమూర్తి.. నేరస్తుడికి శిక్షను ఖరారు చేస్తూ.. నాలుగు లక్షల నష్ట పరిహారాన్ని బాధితురాలికి చెల్లించేలా తీర్పు వెలువరించారని సైఫాబాద్ ఇన్స్పెక్టర్ తెలిపారు.