కేపీహెచ్‌బీ కాలనీ/బాలానగర్/మూసాపేట/మియాపూర్, నవంబర్ 26 : భారత రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరి ప్రధాన బాధ్యత అని అనంత లా కళాశాల ప్రిన్సిపాల్ వి.చంద్రమతి అన్నారు. శనివారం కూకట్‌పల్లిలోని అనంత లా కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం (నేషనల్ లా డే) ఘనంగా నిర్వహించారు. లా డే సందర్భంగా నిర్వహించిన లీగల్ క్విజ్, వ్యాసరచన పోటీల్లో ప్రతిభను చాటిన విద్యార్థులకు బహుమతి, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రవి అనంత, అధ్యాపకులు పి.రమ్యాసత్యం, లక్ష్మీప్రసన్న, అంజూమ్బేగం, కె.సరిత, టి.మణిమంజుల, కె.హారిక, స్వగతానాయక్ తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లి అంబేద్కర్ వై జంక్షన్లో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ అధ్యక్షుడు నర్సింగరావు, కార్యదర్శి సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు బండి సుధ, కవిత, రాము, ప్రభాకర్, పెద్దిరాజు, నర్సింహారావు, నాగరాజు తదితరులున్నారు.
జేఎన్టీయూహెచ్ వర్సిటీలో ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ఎస్సీ, ఎస్టీసెల్ ఆఫీసర్స్ మాధవీకుమారీ, మాధవీలత, వెంకటేశ్వర్ రెడ్డి, చంద్రమోహన్, వెంకటేశ్వర్రావు, ప్రిన్సిపాల్ జయలక్ష్మి, శశికళ, రమణ నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.
హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పరిశ్రమ(హెచ్ఏఎల్)లో 73 భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. శనివారం హెచ్ఏఎల్ పరిశ్రమ ఆవరణలో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హెచ్ఏఎల్ జనరల్ మేనేజర్ అరుణ్ జనార్దన్ సర్కటే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. హెచ్ఏఎల్ ఎస్ఆర్డీసీ జీఎం ప్రభు భూల్ మజుందర్, చీఫ్ ప్రాజెక్ట్స్ సత్యనారాయణ, డీజీఎం సూర్యకుమార్ రౌట్, చీఫ్ జనరల్ మేనేజర్ విఠల్, ఎస్సీస్టీ లైజన్ఆఫీసర్ తుమాన్నే, కార్మిక సంఘ్ అధ్యక్షుడు జానకిరాం, ప్రధాన కార్యదర్శి వెంటళరావు, ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కర్క నాగరాజులతోపాటు నాయకులు పాల్గొన్నారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం డివిజన్ పరిధి గూడ్స్‌షెడ్ రోడ్డులో పాతపల్లి శివశంకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మూసాపేట డివిజన్ టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, కర్క రవీందర్, వెంకటేశ్, పాతపల్లి కృష్ణ, సురేశ్, మల్లేశ్, నర్సింగ్ పాల్గొన్నారు.
వివేకానందనగర్ డివిజన్ సుమిత్రనగర్‌లోని అనంత లా కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు లీగల్ క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈకార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ చంద్రమతి, రమ్యసత్యం, లక్ష్మీప్రసన్న, అంజుం బేగం, సరిత, మణిమంజుల, హారిక, స్వాగత్ నాయక్, మోనీష, జేమ్స్ రల్డే, దీపక్కుమారి పాల్గొన్నారు.