అమీర్‌పేట్, అక్టోబర్ 15: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్లో కొనసాగుతున్న ప్రచార సరళి, తదితర అంశాలపై బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్, హరీశ్‌రావు ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ ఇన్చార్జి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు, డివిజన్, బూత్ స్థాయి ఇన్చార్జ్జిలు పాల్గొన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇంటింటి ప్రచారం చేయాలని నేతలకు కేటీఆర్ సూచించారు.