టాస్క్‌ల పేరుతో ఐటీ ఉద్యోగికి టోకరా
ఇన్‌స్టాగ్రామ్‌లో దుబాయ్ రిసార్ట్ అకామిడేషన్ డీల్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రకటన చూసి ఆకర్షితుడైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ లింక్ క్లిక్ చేసి సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ.25 లక్షలు పొగొట్టుకున్నాడు. అమీన్‌పూర్‌కు చెందిన బాధితుడికి దుబాయ్‌లోని బుల్గారీ రిసార్ట్ హోటల్ రిజర్వేషన్ టాస్క్‌లు పూర్తి చేయాలని సైబర్‌నేరగాళ్లు సూచించారు.
సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఇన్‌స్టాగ్రామ్‌లో దుబాయ్ రిసార్ట్ అకామిడేషన్ డీల్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్రకటన చూసి ఆకర్షితుడైన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆ లింక్ క్లిక్ చేసి సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కి రూ.25 లక్షలు పొగొట్టుకున్నాడు. అమీన్‌పూర్‌కు చెందిన బాధితుడికి దుబాయ్‌లోని బుల్గారీ రిసార్ట్ హోటల్ రిజర్వేషన్ టాస్క్‌లు పూర్తి చేయాలని సైబర్‌నేరగాళ్లు సూచించారు. ఈ టాస్క్‌లు పూర్తి చేస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్ బ్లాక్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. దీనికి ఒప్పుకున్న బాధితుడు మొదట రూ.10 వేలు పెట్టుబడి పెట్టి హోటల్ రిజర్వేషన్ టాస్క్‌లు పూర్తి చేశాడు. దీనికి రూ.40 వేల వరకు లాభం రావడంతో వాటిని విత్ డ్రా చేసుకున్నాడు.
దీంతో సైబర్‌నేరగాళ్లు చెప్పే మాటలపై పూర్తి నమ్మకం పెరిగింది. ఆ తరువాత వీఐపీ,, కాంబినేషన్ టాస్క్‌ల్లో భారీగా లాభాలుంటాయని దప దఫాలుగా రూ.25,12,758 పెట్టుబడి పెట్టించారు. స్క్రీన్‌పై లాభం కన్పిస్తోన్నా విత్ డ్రా చేయకుండా నిలిపేశారు. ఆ డబ్బు విత్ డ్రా చేయాలంటే అకౌంట్ వెరిఫికేషన్ ఫీజుల పేరటి రూ.41 లక్షలు కట్టాలని నేరగాళ్లు ఒత్తిడి తెచ్చాడు. వారి ఒత్తిళ్లతో అనుమానం వచ్చిన బాధితుడు తాను మోసపోయానని గ్రహించి సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

