పహాడి షరీఫ్, మార్చ్ 13: పల్లెలకు పట్టు కొమ్మలుగా ఉన్న నీటి వనరులపై భూ బకాసురులు కన్నీశారు. చెరువులపై కన్ను పడిన చోట ఆ స్థలాన్ని సొంతం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. జనసంచారం లేని సమయంలో అదును చూసి పనులు చేసుకుంటున్నారు. రాత్రికి రాత్రి చెరువు పూడ్చేందుకు కుట్ర పన్నుతున్నారు. పహాడి షరీఫ్ (Pahadi Shareef) పరిధిలోని జల్లపల్లి గ్రామంలో మించినీటి వనరుగా విలసిళ్లుతున్న పెద్ద చెరువుపై కబ్జారాయుల్ల కన్ను పడింది. ఫిరంగి నాలా కనుమరుగు కావడంతో చరిత్రక ఆనవాళ్లు కలిగిన పెద్ద చెరువు సైతం క్రమేణా అక్రణాలమకు గురవుతూ వస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెరువుల పరి రక్షణ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించి పెద్ద చెరువు కబ్జాకు గురికాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ నాయకుల అండదండలతో భూ ఆక్రమణల దారులు తమ వ్యవహారాలను చక్కదిడ్డుకునే ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో పెద్ద చెరువు పరివాహక ప్రాంతాల్లో చెరువు సరిహద్దులను గుర్తించకుండా టిప్పర్ల ద్వారా మట్టిని తెచ్చి ఆయా ప్రాంతాల్లో కుప్పలుగా పోస్తున్నారు.
చెరువు ఆక్రమణలను గుర్తించిన ఇరిగేషన్ ఏఈ వీరేందర్ కుమార్ వెంటనే స్పందించారు. చెరువు ఆక్రమణకు చేస్తున్న ప్రయత్నాలు నిర్ధారించుకున్నారు. పెద్ద చెరువును కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెరువును పూడ్చేందుకు టిప్పర్ల ద్వారా మట్టిని తరలించిన వారిని గుర్తించి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పహాడి షరీఫ్ పోలీసులకు ఆయన గురువారం ఫిర్యాదు చేశారు.