IPL-2023 | క్రికెట్ అభిమానులకు శుభవార్త.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు
IPL-2023 | హైదరాబాద్ నగరానికి క్రికెట్ ఫీవర్ పట్టుకున్నది. దాదాపు రెండేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ వేదికగా ఏడు మ్యాచుల్లో ఆడనున్నది.
IPL-2023 | హైదరాబాద్ నగరానికి క్రికెట్ ఫీవర్ పట్టుకున్నది. దాదాపు రెండేళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఉప్పల్ వేదికగా ఏడు మ్యాచుల్లో ఆడనున్నది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్నది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలుకానున్నది. అయితే, క్రికెట్ అభిమానుల కోసం మెట్రో శుభవార్త చెప్పింది. ఆదివారం జరిగే మ్యాచ్ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. రద్దీ నేపథ్యంలో నాగోల్-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడుపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. మరో వైపు ఉప్పల్ మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మరో వైపు ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు 1500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. స్టేడియం లోపల, వెలుపల 340 సీసీకెమెరాలను ఏర్పాటు చేశామని, అలాగే జాయింట్ కమాండ్, కంట్రోల్ రూంను సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు. డే మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల కంటే ముందు స్టేడియాన్ని తెరుస్తామని, నైట్ మ్యాచ్‌లు జరిగిన సమయంఏల సాయంత్రం 4:30 గంటలకు స్టేడియాన్ని అభిమానుల కోసం తెరువనున్నట్లు వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

