ఐజీహెచ్జీడీలో సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 4 : ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనిటిక్ డిసీజెస్ (ఐజీహెచ్జీడీ)లో ‘క్లినికల్ జెనిటిక్స్ ,డయోగ్నస్టిక్స్ అండ్ మేనేజ్మెంట్’అనే అంశంపై సర్టిఫికెట్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐజీహెచ్జీడీ డైరెక్టర్ డాక్టర్ బి. విజయలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు.
మెడిసిన్, డెంటిస్ట్రీ, జెనిటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జువాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మసీ, నర్సింగ్ తదితర విభాగాలలో కనీసం యాభై శాతం మార్కులతో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులని చెప్పారు.
ఆరు నెలల వ్యవధి గల ఈ కోర్సులో 20 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ వెబ్సైట్లు www.instituteofgenetics.org, www.osmania.ac.in లోకి ప్రవేశించి ఆన్లైన్ దరఖాస్తును ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారిని ఇంటర్వ్యూ విధానం ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
ఎంపికైన వారి జాబితాను 27వ తేదీన తమ వెబ్సైట్లో ఉంచుతామని, వచ్చే నెల 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు. ఇతర వివరాలకు తమ వెబ్సైట్లో చూసుకోవచ్చని ఆమె సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

