సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫెస్టివల్(International Startup Festival) సంస్థ ఆధ్వర్యంలో టీ హబ్‌లో(T Hub) ఇన్వెస్టర్ కనెక్ట్ సదస్సును(Investor Connect conference) నిర్వహిస్తు న్నామని చైర్మన్ జె.ఎ.చౌదరి తెలిపారు. ఔత్సాహిక స్టార్టప్ వ్యవస్థాపకులను, టైర్-2, టైర్-3 పట్టణాల్లో ఉండి సరికొత్త ఆవిష్కరణలు చేసేందుకు స్టార్టప్‌లను ప్రారంభించాలనుకున్న వారిని పెట్టుబడుల పరంగా సహకారాన్ని అందించేందుకు ఇన్వెస్టర్ కనెక్ట్ సదస్సును నిర్వహిస్తున్నామని తెలిపారు.
దేశంలోనే ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టు సంస్థలైన కలారీ క్యాపిటల్, ఆర్కా మీడియా వర్క్స్, ఎంథిల్ వెంచర్స్, ఎండ్రియా పార్టనర్స్,సక్సీడ్ ఇన్నోవేషన్ ఫండ్, పేవ్‌స్టోన్,ఎన్టీటీ డాటా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారని తెలిపారు. టీ హబ్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు ఇన్వెస్టర్ కనెక్ట్ సదస్సు ఉంటుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Yadadri | రేపు యాదాద్రికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ..!