Gandham Victoria | కాచిగూడ, జనవరి 19: నగరంలోని బర్కత్పుర ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీని విక్టోరియా ఓపెన్ వాటర్ స్విమ్మింగ్లో సరికొత్త రికార్డు నెలకొల్పంది. స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ అనుమతితో ఆదివారం తన కుమారుడు సీఫెన్కుమార్తో కలిసి అరేబియా సముద్రంలోని మాండ్వా జట్ నుంచి ముంబై గేట్వే ఇండియా వరకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు.
అరేబియా సముద్రం మాండ్వా జట్ వద్ద ఉదయం 7 గంటల 36 నిమిషాలకు ఈ ఇద్దరు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటల 37 నిమిషాలకు ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా చేరుకొని ఈ రికార్డు నెలకొల్పారు. అరేబియా సముద్రంలో 17 కిలో మీటర్ల దూరాన్ని ఈ ఇద్దరు ఏడు గంటల ఒక్క నిమిషం వ్యవధిలో గమ్యస్థానం చేరుకున్నారు. ఈ సందర్భంగా స్విమ్మర్ క్వీని విక్టోరియా మాట్లాడుతూ.. సప్త సముద్రాలను తన కుమారునితో ఈదడమే లక్ష్యమని తెలిపారు.