కొండాపూర్, సెప్టెంబర్ 17: అంతర్జాతీయ ఫొటోగ్రఫీ ఫెస్టివల్లో భాగంగా మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన విజేతలను శనివారం ప్రకటించారు. విజేతల అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పలు పురాతన కట్టడాలను అభివృద్ధిలోకి తీసుకువచ్చి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతుందన్నారు. నగరంలో 32కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్‌ను కూడా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఐఎఫ్పీలో భాగంగా ఉత్తమ చిత్రాలు తీసిన ఫొటోగ్రాఫర్లను ఆయన అభినందించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఫొటోగ్రాఫర్ అండ్ జర్నలిస్ట్ రఘు రాయ్, డొమెన్ క్యూ, నేషనల్ జీయోగ్రఫీ ఫొటోగ్రాఫర్ స్వప్నరెడ్డి, లీడింగ్ స్ట్రీట్ ఫొటోగ్రాఫర్ ప్రసంజిత్ యాదవ్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కే.లక్ష్మి పాల్గొన్నారు.