సిటీబ్యూరో, ఆగస్టు 16 ( నమస్తే తెలంగాణ ): సరికొత్త ఆవిష్కరణలకు ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమం అవకాశం కల్పిస్తుందని హైదరాబాద్ కలెక్టర్ శర్మణ్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన ఐదుగురి విజేతలకు ప్రశంసాపత్రాలను ఆయన అందించారు. శరీర గాయాలను నివారించడానికి సులభంగా పైకి లేపేల ఇన్నోవేషన్‌కు గాను రవికర్‌రెడ్డి, ప్రమాద సమయంలో బైక్ డ్రైవర్లకు తీవ్ర గాయాలను నివారించడానికి ఎయిర్ బ్యాగ్ మెకానిజం రూపకల్పనకు యశ్విన్, మెకానికల్ బ్యాటరీల తయారీకి గాను శ్రీనివాస్, సోలార్ ప్యానెల్ ప్లగ్ అండ్ ప్లే ఏసీ పవర్ జనరేషన్‌కు గౌతమ్, టక్క్రు డ్రైవర్లు తమ పల్స్ రేటుపై అప్రమత్తం చేయడానికి స్మార్ట్ గ్లౌవ్స్ ఇన్నోవేషన్‌కు సాఫీయా బేగం అండ్ పద్మజా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.