హయత్‌నగర్ : రోడ్డు ప్రమాదంలో ఓ ట్రాలీ ఆటో డైవర్‌కు గాయాలైన సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ మండలం, నర్కూడ గ్రామానికి చెందిన మునగాల రాజశేఖర్ (27), ట్రాలీ ఆటో నెం ః (టీఎస్ 08 యుబి 7113)ను నడుపుకుంటూ హయత్‌నగర్‌లోని భాగ్యలత కాలనీ నుండి తుర్కయాంజాల్‌కు బయలుదేరాడు.
మార్గమధ్యలో సాయినగర్ కాలనీ వద్దకు రాగానే ట్రాలీ ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆటో నడుపుతున్న రాజశేఖర్ తలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.