మన్సూరాబాద్, జనవరి 22: నాగోల్ డివిజన్ శివారు కాలనీల్లో రోడ్లు, మంచినీరు, యూజీడీ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టి ప్రజలకు పూర్తిస్తాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. నాగోల్ డివిజన్ పరిధి అనంతుల కాలనీలో యూజీడీ పైపులైన్, సాయినగర్ కాలనీలో యూజీడీ పైపులైన్, వాంబేకాలనీలో చిల్డ్రన్స్ పార్కు, వాకింగ్ ట్రాక్, అనంతుల వీరారెడ్డి కాలనీల్లో సీసీ రోడ్డు పనులకు రూ.61.72 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ చింతల అరుణతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీల్లోని ఖాళీ స్థలాలు కబ్జాకు గురవుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ఖాళీ స్థలాలను పరిరక్షించడంతో పాటు వాటిని ఆక్రమిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదరు ఖాళీ స్థలాలను కాలనీ ప్రజల అవసరాల నిమిత్తం వాడుకునేలా చర్యలు తీసకుంటామని పేర్కొన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తూ ఇప్పటికే కోట్లాది రూపాయలతో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం నగరానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని.. కోట్లాది రూపాయలతో ఎల్బీనగర్లోని ప్రధాన కూడళ్లలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్డు నిర్మాణాలు చేపట్టి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. వర్షా కాలంలో లోతట్టు ప్రాంతాల్లో వరదముంపు సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు గాను నూతనంగా నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేస్తున్న యూజీడీ ట్రంక్‌లైన్ల నిర్మాణ పనులు దాదాపు ముగింపు దశకు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాయినగర్ కాలనీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి యుగంధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లప్ప, బాలాజీ ఎన్క్లేవ్ అధ్యక్షుడు ఏ.జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎంఏ గిరిధర్‌గౌడ్, ఉపాధ్యక్షుడు విద్యాసాగర్ రెడ్డి, కోశాధికారి దినేశ్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, వాంబేకాలనీ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, సభ్యులు చిన్న, నర్సింగ్‌రావు, బాజీఖాన్, చందన, సరిత, సాయికుమారి, ఉమా మహేశ్వర్‌రావు, బీఆర్ఎస్ నాగోల్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, నాయకులు సుర్వి రాజుగౌడ్, తూర్పాటి కృష్ణ, సతీశ్‌యాదవ్, డప్పు రాజు తదితరులు పాల్గొన్నారు.
స్వర్ణకారుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా..
స్వర్ణకారులకు రాష్ట్ర ప్రభుత్వమే అండగా ఉంటుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చంపాపేట డివిజన్ పరిధిలోని ఏపీఆర్ గార్డేన్‌లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్వర్ణకారుల సంఘం సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. స్వర్ణకారులను పోలీసులు వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు. యంత్రాలు రావడంతో ఇప్పటికే చేతి వృత్తులపై ఆధారపడి జీవించే స్వర్ణకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చేతి వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళుతానని తెలిపారు. అంతే కాకుండా స్వర్ణకారులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యే విధంగా తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ర్ట అధ్యక్షుడు వింజమూరి రాఘవ చారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి, మారోజు జంగాచారి, అడ్వొకేట్ రఘునాథ్ చారి, వెంకటాచారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, తదితరులు పాల్గొన్నారు.