గ్రేటర్ భారీ ఎత్తున పారిశ్రామిక ప్రగతిని సాధించడమే కాకుండా పరిశ్రమల సులభతర వాణిజ్యం (ఈవోడీబీ)లోనూ దేశంలో ముందంజలో నిలిచింది. సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన విప్లవాత్మక నూతన పారిశ్రామిక విధానం (టీఎస్-ఐపాస్) సత్ఫలితాలివ్వడమే ఇందుకు కారణంగా..మరోవైపు తెలంగాణకు అంచనాలకు మించి దేశ, విదేశీ పారిశ్రామిక వేత్తల నుంచి రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తడానికి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఎంతగానో దోహదపడుతున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల పెట్టుబడులను పరిశీలిస్తే మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో 2,967 పరిశ్రమలు అనుమతులు పొందగా..రూ.15,460కోట్ల పెట్టుబడితో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 1309 పరిశ్రమలతో నిలిచింది.