శంషాబాద్ రూరల్, జనవరి 30 : ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులపై గౌరవం పెరిగిందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ గ్రామంలో మైహోంగ్రూపు సంస్థ సహకారంతో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ను హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులపై ప్రజల్లో గౌరవం పెరిగిందన్నారు. కేసులు త్వరిత గతిన పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జిల్లా పరిషత్ ప్లోర్ లీడర్ తన్విరాజు,వైస్ ఎంపీపీ నీలంనాయక్, సర్పంచ్ చంద్రశేఖర్,ఎంపీటీసీ చెక్కల ఎల్లయ్య,మాజీ సర్పంచ్ సత్యనారాయణగౌడ్, సీఐ ప్రకాశ్ రెడ్డి పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.