Teacher training | హెచ్‌సీయూలో ‘ఇన్ -సర్వీస్’ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం

కొండాపూర్ : ఉపాధ్యాయులు తరగతిని దాటి సరికొత్త పాఠాలు నేర్చుకోవాలని, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎప్పటికప్పుడు నైపుణ్యతలను పెంచుకోవడంతో పాటు నైతికత, మంచి మనస్సుతో సహకారాన్ని అందించాలని ఇంగ్లీషు అండ్ ఫారెన్ ల్యాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఈఫ్లూ) రిటైర్డ్ ప్రొఫెసర్ వీ సుధాకర్ తెలిపారు. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉపాధ్యాయుల శిక్షణ కోసం ‘ఇన్ -సర్వీస్’ ట్రైనింగ్ పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ బీజే రావుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ది దేశానికి అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. ఉపాధ్యాయులు కేవలం తరగతి గదికే పరిమితమవ్వకుండా బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, తమ స్కిల్స్‌ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలన్నారు. అనంతరం వర్సిటీ పూర్వ విద్యార్థులు అందజేసిన ట్యాబ్‌లు, మొబైల్ ఫోన్లను ఆన్లైన్ తరగతులకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. ఉపాధ్యాయుల శిక్షణ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (డీఈఈటీ) ఆధ్వర్యంలో వర్సిటీలోని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విభాగంలో 21 రోజుల పాటు సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ వై సుధాకర్‌రెడ్డి, డాక్టర్ మధుసూదన్, ప్రొఫెసర్ భువనేశ్వర లక్ష్మీ, ప్రొఫెసర్ వీఎస్ నాగేశ్వర రావు, డాక్టర్ గీత గోవింద, డాక్టర్ క్రిష్ణ, పీ మురళీ, డాక్టర్ టీ సుమలిని, డాక్టర్ ఏఎస్ జలందరచారీ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

