కవాడిగూడ, జూన్ 9: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. వానకాలం వస్తున్నందున అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. శుక్రవారం భోలక్‌పూర్ డివిజన్లోని రంగానగర్ లాల్‌బహదూర్ శాస్త్రీ కమ్యూనిటీ హాల్ వద్ద సుమారు రూ. 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ఆయన కార్పొరేటర్ మహ్మద్ గౌసొద్దీన్ తహతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భోలక్‌పూర్ డివిజన్లో ఇప్పటివరకు రూ. 1.60 కోట్ల తో తాగునీరు, డ్రైనేజీ పైప్లైన్లు, సీసీ రోడ్లు, కచ్చామోరీ నిర్మాణం, కమ్యూనిటీ హాళ్ల ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు.
అధికారులు డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు ముఠా జయసింహ, భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్‌రావు, బొంతల బస్తీ అధ్యక్షుడు నర్సింగరావు, జీహెచ్ఎంసీ డీఈ సన్ని, ఏఈ బి. సుభాశ్, పార్టీ డివిజన్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అలీ, జునైద్ బాగ్ధాది, రహీం, శంకర్‌గౌడ్, ఉమాకాంత్ ముదిరాజ్, కృష్ణ, ఆర్. శ్రీనివాస్, మక్బూల్, జబ్బార్, కృష్ణ, ఎల్లేశ్, కేఎం సాయి, సురేందర్, సునీల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.