Vehicle Tax | సిటీబ్యూరో: వాహన పన్ను చెల్లించకుండా తిరుగుతున్న రవాణా వాహనాలపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు. ప్రత్యేక తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 220 వాహనాలు పన్ను చెల్లించకుండా తిరుగుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. 15 లక్షల పన్ను వివిధ రకాల వాహనాల నుంచి వసూలైంది.
పన్ను చెల్లించకుండా నిబంధనలు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జేటీసీ రమేశ్ మాట్లాడుతూ.. నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టామన్నారు. వాహనానికి సంబంధించి ఆర్టీఏ నిబంధనలన్నీ పాటించాల్సిన బాధ్యత వాహనదారులదేనని చెప్పారు.