చర్లపల్లి, డిసెంబర్ 6 : కేరళ రాష్ట్రంలోని కోజికొడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో కొంత కాలంగా చికిత్స పొందుతూ పూర్తిగా కొలుకున్న వ్యక్తి కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధి వ్యక్తిగా అక్కడి పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసుల కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. ఇతని పేరు శ్రీరాములు(55) అని, ఇతనికి భార్య లక్ష్మి, కూతుళ్లు స్రవంతి, యమున ఉన్నట్లు తెలిపారు. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌తో పాటు కీసర, బండ్లగూడ, దమ్మాయిగూడ, నాగారం, చిర్యాలకు చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడి ఆచూకీ తెలిసినవారు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కుషాయిగూడ పోలీసులు కోరారు.