Komatireddy Rajagopal Reddy | కాంగ్రెస్ హైకమాండ్ తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో హామీ ఇచ్చిందని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు గతంలో హామీనిచ్చిన అధిష్టానం ఇపుడు ఏం చేస్తుందో తెలియదన్నారు. నేను మంత్రి పదవి కోసం పాకులాడడం లేదు. ఏ పదవి లేకున్నా రాజగోపాల్ రెడ్డికి ప్రజల్లో తగిన గౌరవం ఉంటుందన్నారు.
నాకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే నా లాంటి తెలంగాణ ఉద్యమకారుల సేవలు అవసరమన్నారు. తనకు రేవంత్ రెడ్డితో ఎలాంటి ఇబ్బంది లేదని.. నిన్న ముఖ్యమంత్రితో ప్రత్యేక భేటీ లేదు, ఎదురుపడితే పలకరించుకున్నామని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ కేటీఆర్‌తో కూడా సాధారణంగా అన్ని విషయాలపై మాట్లాడానన్నారు.
Lokesh Kanagaraj | లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాహనంలో AK-47లు.. తనిఖీల్లో అధికారులకు షాక్!
Vijayawada | విజయవాడలో టెర్రర్ కలకలం.. ముగ్గురు యువకులను ఉగ్రవాదంవైపు నెట్టిన హైదరాబాద్ యువతి!
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పంటించిన దుండగుడు.. పలువురికి తీవ్ర గాయాలు