Disabled Person | అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ బస్సు భవన్ ముందు వికలాంగుల ధర్నా చేపట్టారని తెలిసిందే. ప్రభుత్వానికి నిరసన తెలుపుతున్న వికలాంగులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పరిగి నుంచి పెన్షన్ కోసం నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన ఓ వికలాంగుడు మాట్లాడుతూ.. పెన్షన్లు పెంచడం లేదు.. రూ.6 వేల ఇస్తామన్నరు.. ఇవ్వలేదు. అదే రూ.4 వేలు మాత్రమే ఇస్తున్నరు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మార్పు అంటూ ఏమీ లేదు.. చాలా దారుణంగా ఉంది. అస్సలు చెప్పొద్దు.. ఇప్పటివరకు ఏ పథకం కూడా నాకు రాలేదు. ఫ్రీ బస్ అన్నరు.. లేనే లేదన్నాడు.
నేను పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాను.. కానీ అట్లాంటిది నేను చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి.. మా కుటుంబం మొత్తం కాంగ్రెస్కు సపోర్టు చేస్తుంది.. కానీ ఏం లాభం.. గెలిచినంక మాకు సపోర్ట్ చేస్తడనుకుంటే మాకే వెన్నుపోటు పొడిచిండు. ఉండి ఏం లాభం ఆయన.. ఇంకోసారి ఆయన ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లడుగుతడు. మేము తిట్టుకుంటం.. బరాబర్ తిడతం. ఏం చేయనప్పుడు ఇంకేం చేస్తమన్నాడు.
2035 వరకు కాంగ్రెస్ పార్టీ ఉండేంత సీన్ లేదు ఇక.. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయను.. వేయదలచుకోలేదు. నేను ఓటు వేయకపోవడమే కాదు.. 100 మందికి ఓటేయొద్దని చెప్తా. నేను 6 నెలలు ముందు నుంచి తిరిగి మా నియోజకవర్గంలో ఎమ్మెల్యేను గెలిపించిన. ఇప్పటివరకు ఏం లేదు మరి. ఇంకేం మార్పుంది.. కాంగ్రెస్కు ఓట్లేసి మా చెప్పుతో మేం కొట్టుకున్నట్టైంది. పరిగిలోని ఊళ్లలో ఇండ్లళ్లకు కాంగ్రెస్ నాయకులు పోతే కొట్టి చంపుతరని హెచ్చరించాడు.
పుట్టినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాను కానీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయను
రేవంత్ రెడ్డి మా వికలాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తానని ఓట్లు వేయించుకుని, ఇప్పుడు మాకే వెన్నుపోటు పొడిచాడు
మార్పు అని ఓటు వేస్తే మా చెప్పు తీసుకుని మేమే కొట్టుకున్నట్టు అయింది
కాంగ్రెస్ వాళ్లు రైతుల దగ్గరికి పోయి ఓట్లు అడిగితే కొట్టి చంపుతారు
– పెన్షన్ కోసం ఆందోళన చేస్తున్న వికలాంగుడు
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2026
Uttarpradesh: టీ కోసం దాబా వద్ద ఆగారు.. 8 ఏళ్ల కొడుకును వదిలేసి 80 కిలోమీటర్ల దూరం వెళ్లారు
Paddy Crop | జనరేటర్ పెడితే రోజుకు రూ.3-4 వేలు ఖర్చు.. పశువులకు మేతగా వరి పంట.. వీడియో