హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా (HYDRA) కూల్చివేతలు చేపట్టింది. మియాపూర్ హైదర్‌నగర్‌లోని హెచ్ఎండీఏ లేఅవుట్లో అక్రమంగా నిర్మించిన షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. హైదర్‌నగర్ సర్వే నంబర్ 145/3లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టడంతో వాటిని తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు, హైడ్రా సిబ్బంది భారీగా మోహరించారు.