రాజేంద్రనగర్/మియాపూర్/గోషామహల్, నవంబర్ 22; ఆదినుంచీ నిరుపేదలే లక్ష్యంగా నిబంధనల పేరుతో వారి జీవనోపాధికి గండికొడుతున్న రేవంత్ సర్కార్.. చిరువ్యాపారులపై మరోసారి జులుం ప్రదర్శించింది. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, గోషామహల్ నియోజకవర్గాల్లోని మియాపూర్, బండ్లగూడ, మంగళ్‌హాట్‌లో నిబంధనలను సాకుగా చూపి చిరువ్యాపారులు పొట్టకూటి కోసం ఏర్పాటు చేసుకున్న చిన్నచిన్న డబ్బాలపై శనివారం బుల్డోజర్ నడిపింది. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారనే కారణంతో ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా బల్దియా అధికారులు.. పోలీసు బందోబస్తు నడుమ చిరువ్యాపారులు ఏళ్లుగా ఏర్పాటుచేసుకొని జీవనోపాధి పొందుతున్న డబ్బాలు, దుకాణాలను కూల్చివేశారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపై ఖాకీలు బల ప్రదర్శన చేశారు. నిరుపేదల పొట్టకూటిపై దెబ్బకొట్టి పైశాచిక ఆనందం పొందుతున్న సర్కార్ తీరును చూసి అక్కడున్న వారంతా ముక్కున వేలేసుకున్నారు.

Hyd2