జగద్గిరిగుట్ట, ఫిబ్రవరి 20: హైదరాబాద్లో హైడ్రా (HYDRA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జగద్గిరిగుట్టలోని భూదేవిహిల్స్ సమీపంలోని పరికి చెరువు వద్ద ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. అదేవిధంగా గాజులరామారం సమీపంలోని మహదేవపురం ప్రాంతంలోని కొన్ని బేస్మెంట్లను కూడా కూల్చివేశారు. గత వారం చెరువు పరిరక్షణ సమితి సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు.