
అంబర్‌పేట, జనవరి 2 : సెంట్రల్ ఎక్సైజ్(సీఈ) కాలనీని మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాలనీలో నెలకొన్న ఏ సమస్యనైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో డివిజన్ కార్పొరేటర్ బి.పద్మావెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అందరూ ఆ యురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాలనీవాసులతో మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. సీఈ కాలనీ ఇప్పటికే స్వచ్ఛ కాలనీగా ఎంపికై అవార్డును కూడా పొందడం అభినందనీయమన్నారు. అనంతరం కాలనీకి చెందిన రాయవరపు అవ్యక్త ఇటీవల ఏఐటీఎస్ ఏటీఎస్ టెన్నిస్ టోర్నమెంట్లో గెలుపొంది జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎమ్మెల్యే అవ్యక్తని అభినందించి మెమెంటోను అందజేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ప్రోత్సాహం అందజేస్తామని పేర్కొన్నారు. అంతకుముందు కాలనీకి చెందిన పలువురు సీనియర్ సిటిజన్స్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. కరోనా కారణంగా బర్త్‌డేలను జరుపుకోని సీనియర్ సిటిజన్స్‌తో కేక్ కటింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో అసిసోయేషన్ అధ్యక్షుడు రామకృష్ణరాజు, ప్రధాన కార్యదర్శి పడాల వెంకట్రావు, సత్యనారాయణ, చిలువేరు యాదగిరి, సుధాకర్‌రావు, శ్యాంసుందర్, కామేశ్వరరావు, పార్థసారథి, విజయలక్ష్మి, శైలత, లలిత, సాంబమూర్తి, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డా.ఎన్.గౌతంరావు, బీజేపీ నాయకులు పి.గోవర్ధన్‌రెడ్డి, చుక్కజగన్, దత్తు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, టైప్ శ్రీను, కెంచె మహేశ్ తదితరులు పాల్గొన్నారు.