ఇంట్లోనే చదివి.. విజేతగా నిలిచి..
తండ్రి లేని లోటు.. ఆర్థిక కష్టాలు ఎదురైనా.. కుంగిపోలేదు...తల్లి ఆశీర్వాదం.. ఆమె ఇచ్చిన కొండంత ధైర్యంతో సివిల్స్‌లో సత్తాచాటారు జనగామ జిల్లాకు చెందిన సస్యరెడ్డి. కుటుంబంతో కలిసి దుండిగల్ గండిమైసమ్మలో అద్దెకు ఉంటున్న ఆమె.. బీటెక్ నాలుగో సంవత్సరం నుంచే సివిల్స్‌కు శ్రీకారం చుట్టారు
ఆల్ఇండియా 214 ర్యాంకర్ సస్యరెడ్డికి సన్మానం
సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ): తండ్రి లేని లోటు.. ఆర్థిక కష్టాలు ఎదురైనా.. కుంగిపోలేదు…తల్లి ఆశీర్వాదం.. ఆమె ఇచ్చిన కొండంత ధైర్యంతో సివిల్స్‌లో సత్తాచాటారు జనగామ జిల్లాకు చెందిన సస్యరెడ్డి. కుటుంబంతో కలిసి దుండిగల్ గండిమైసమ్మలో అద్దెకు ఉంటున్న ఆమె.. బీటెక్ నాలుగో సంవత్సరం నుంచే సివిల్స్‌కు శ్రీకారం చుట్టారు. మూడు సార్లు పరీక్షలు రాసినా.. లక్ష్యం చేరలేదు.. అయినా.. ఎన్నడూ నిరుత్సాహ పడలేదు. ఆన్లైన్ ఉద్యోగం చేసుకుంటూనే.. ఎలాగైనా సివిల్స్ విజేతగా నిలవాలనే పట్టుదలతో తొమ్మిది గంటల పాటు కష్టపడ్డారు.
ఆన్లైన్, యూట్యూబ్ వీడియాల ద్వారా ప్రిపేర్ అయ్యారు. విజేతల బుక్ లిస్టులను కొనుగోలు చేసి.. ఇంట్లోనే చదువుకొని.. ఆల్ఇండియా 214 ర్యాంక్‌ను సాధించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆమెను నేరేడ్మెట్ రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ సన్మానించి..అభినందించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

