జవహర్‌నగర్, ఏప్రిల్ 29: మూడు రోజుల్లోనే పుట్టిన రోజు వేడుకలు ఉన్నాయని.. రీల్స్ చేసుకుని పుట్టినరోజును ఘనంగా జరుపుకుందామని కలలు కన్నా ఓ యువకుడి సంతోషం క్వారీ గుంత రూపంలో మృ త్యువు కబలించింది. ఈ విషాద ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్కారంలో చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కౌకూర్ భరత్‌నగర్‌లో దొపరివాడ రమేష్, భార్యవాణి, ఇద్దరు కుమారులు, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. చిన్న కుమారుడు తరుణ్ (17) ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు.
తరుణ్ పుట్టిన రోజు వేడుకలు మూడు రోజుల్లోనే ఉండటంతో ఫొటోషూట్ కోసం గూగుల్‌లో వెతికాడు. జవహర్‌నగర్ మల్కారంలో గుట్ట లు, పక్కనే క్వారీ గుంత కనిపించడంతో ఐదుగురు స్నేహితులతో కలిసి సోమవారం అక్కడికి చేరుకున్నారు. గుట్టలపై కొందరు మిత్రులు ఫొటోలు దిగుతుండగా తరుణ్, మరో స్నేహితుడు కలిసి క్వారీ గుంతలోకి దిగడానికి ప్రయత్నించారు. తరుణ్‌కు లోతు తెలియకపోవడంతో ఈతరాక మునిగిపోయాడు.అతడిని బయటకు తీసేందుకు స్నేహితులు ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది.
వెంటనే కుటుంబసభ్యులకు, జవహర్‌నగర్ పోలీసులకు సమచారం అందించారు. సోమవారం రాత్రి కావడంతో మృతదేహాన్ని బయటకు తీయడానికి సాధ్యం కాలేదు. మంగళవారం ఉదయం డీఆర్ఎఫ్ బృందాలు, జవహర్‌నగర్ పోలీసులు సా యంతో మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. ఈ విషయమై పోలీసులను వివరణ అడగ్గా కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయలేదని తెలిపారు.