Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు పలు చోట్ల మోస్తరు వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో.. శుక్రవారం ఉదయం 8:30 గంటల నుంచి శనివారం ఉదయం 8:30 గంటల వరకు పలు చోట్ల నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 11.5 మి.మీ., శివరాంపల్లిలో 10.5 మి.మీ., టోలిచౌకీలో 10 మి.మీ. వర్షపాతం నమోదైంది.
రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే నిజామాబాద్‌లోని భీంగల్‌లో అత్యధికంగా 107.8 మి.మీ., జయశంకర్లోని ముత్తారం మహాదేవ్‌పూర్‌లో 107 మి.మీ., నిర్మల్‌లో 103, కమ్మరపల్లిలో 100.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.