హైదరాబాద్ : రౌడీషీటర్ మన్మోహన్ సింగ్(45)ను మంగళ్‌హాట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతన్నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్, కల్తీ మద్యం విక్రయించడం, హత్యా కేసుల్లో మన్మోహన్ సింగ్ నిందితుడిగా ఉన్నాడు. 2002 నుంచి మన్మోహన్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా కేసులో మన్మోహన్ సింగ్.. నాలుగు రోజు క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు. ఇక ఆదివారం నుంచే తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. సూర్యాపేటలో 2 కిలోల గంజాయిని రూ. 8 వేలకు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.