ప్రజా ఉద్యమంగా నీటి సంరక్షణ
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి పొదుపును ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం జలమండలి ప్రధాన కార్యాలయంలో నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రూపొందించిన పానీ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు.
- పానీ యాప్ ఆవిష్కరణ
సిటీబ్యూరో: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి పొదుపును ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గురువారం జలమండలి ప్రధాన కార్యాలయంలో నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రూపొందించిన పానీ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవడంతో వచ్చే జనవరి నుంచి ఆగస్టు వరకు సుమారు 100 ఎంజీడీల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అన్నారు. దీని అదిగమించేందుకు గోదావరి, కృష్ణా, ఉస్మాన్ సాగర్ నుంచి అదనంగా 60ఎంజీడీల నీటిని సమీకరిస్తామన్నారు. మిగిలిన 40 ఎంజీడీల లోటు ప్రభావం పటాన్ చెరు నుంచి నార్సింగి వరకు సుమారు మూడు లక్షల కనెక్షన్లపై ప్రభావం పడుతుందన్నారు. ప్రస్తుతం నగరానికి రోజుకు 560 నుంచి 570 ఎంజీడీల నీటి సరఫరా అవుతుందనీ, భూగర్భ జలాలు తగ్గడంతో ట్యాంకర్ల డిమాండ్ గణనీయంగా పెరిందన్నారు. నివాస గృహాలు, అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు తప్పనిసరి చేయాలన్నారు. ప్రతి కుటుంబం కకనీసం 20శాతం నీటిని పొదుపు చేసేలా ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

