మైలార్దేవరపల్లి, ఫిబ్రవరి 12: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు. బుధవారం అత్తాపూర్ డివిజన్ హైదర్గూడ ఈశ్వర్ థియేటర్ ప్రాంతంలో ఉన్న యూటర్న్ వద్ద దిమ్మలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదర్గూడ ఈశ్వర్ థియేటర్ ప్రాంతంలో ఎప్పుడూ రద్దీగా ఉండి ప్రమాద భరితంగా మారిందన్నారు.
దీంతో వాహనదారులు, పాదాచారుల సౌకర్యార్థం దిమ్మలను ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారిస్తున్నట్లు అని తెలిపారు. సర్వీస్ రోడ్డుపై ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణాలు అవుతున్నానన్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమనిబంధనలను తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.