ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు
ముషీరాబాద్ బస్‌డిపో సమీపంలోని నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి కింద 33/11కేవీ ఇండోర్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఈ చర్చకు కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ పిల్లర్లు 63,64 మధ్య స్థలాన్ని పరిశీలించిన అధికారులు, అక్కడ రెండు 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యంతో మోడల్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : ముషీరాబాద్ బస్‌డిపో సమీపంలోని నాయిని నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జి కింద 33/11కేవీ ఇండోర్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఈ చర్చకు కేంద్రంగా మారింది. ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ పిల్లర్లు 63,64 మధ్య స్థలాన్ని పరిశీలించిన అధికారులు, అక్కడ రెండు 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యంతో మోడల్ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించారు. అదే విధంగా నగరంలోని క్యూర్ పరిధిలో సాంకేతికంగా అనువైన ఫ్లైఓవర్ల కింద 8-10 మోడల్ కాంపాక్ట్ ఇండోర్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ కూడా అధ్యయనం చేసినట్లుగా తెలిసింది. అన్ని భద్రతా ప్రమాణాలతో కూడిన అనుమతులు పొందడంతో మొదలయ్యే వ్యవస్థ నిర్వహణ విషయం వరకు ఈ ప్రాజెక్టులోని ప్రతి అంశం చాలా సున్నితమైనది కాగా, ప్రజాభద్రతకు సంబంధించినది చాలా ముఖ్యమైనదిగా విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా స్థలాల కొనుగోలు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా చెబుతూ కాంపాక్ట్ సబ్‌స్టేషన్ ఒకటి ఏర్పాటు చేయడానికి రూ.8 నుంచి 10 కోట్లు ఖర్చుగా అంచనా వేశారు. అదే సమయంలో ఐటీ కారిడార్‌లో భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గచ్చిబౌలి, కొత్తగూడ పిల్లర్ నెంబర్ 59-61, కొండాపూర్ 8వ బెటాలియన్ పిల్లర్ నెంబర్ 2 నుంచి 3 మధ్యలో మూడు సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు తెలిసింది. ైహైదరాబాద్లోని ఫ్లై ఓవర్ల కింద అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు, పార్కింగ్, పాదచారుల కదలికలు ఉంటాయి. సబ్‌స్టేషన్ నిర్వహణ, మరమ్మతులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి వంటి పనులు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో తగినంత స్థలం, వాహనాల ప్రవేశం, సురక్షిత పని ప్రదేశం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్‌లు తిరిగే పరిస్థితులు అనుకూలంగా ఉండాలని నిపుణులు చెప్పారు. స్థలాల కొరత ఉన్నందుకే ఫ్లై ఓవర్ల కింద ఇండోర్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని సీఎండీ జితేష్ వీ పాటిల్ చెప్పినా ప్రజా భద్రత విషయంలో ప్రమాణాలు పాటిస్తున్నారా లేక హడావిడిగా పనులు పూర్తి చేసి భవిష్యత్‌లో సమస్య తలెత్తే ప్రమాదానికి అవకాశమిస్తారా అనే చర్చ జరుగుతోంది.
ప్రజాభద్రత ప్రమాదంలో పడేనా..!
విద్యుత్ సబ్‌స్టేషన్ లో అధిక వోల్టేజీ పరికరాలు, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్‌గేర్, కేబుళ్లు నిరంతరం పనిచేస్తుంటాయి. కాగా ఇలాంటి వ్యవస్థను ఫ్లై ఓవర్ల కింద ఏర్పాటు చేస్తే గాలి ప్రసరణ, ఉష్ణోగ్రత నియంత్రణ, నీరు చేరకుండా రక్షణ, అగ్నిమాపక సదుపాయాలు, విద్యుత్ లీకేజీ నివారణ, ఎమర్జెన్సీ ఎగ్జిట్, నిర్వహణ సిబ్బంది రాకపోకలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని కమిటీ సభ్యుడు ఒకరు అభిప్రాయపడ్డారు. వీటిపై కసరత్తు చేసినప్పటికీ కొన్ని అంశాలు తమకు ఇబ్బందిగానే ఉన్నాయని, తాము పరిశీలించిన అంశాలను యథాతథంగా సీఎండీకి చెప్పామని కమిటీ సభ్యులు తమ సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలిసింది.
ఏదైనా పరికరం వేడెక్కినా, షార్ట్ సర్క్యూట్ జరిగినా కేబుల్ దెబ్బతిన్నా, అగ్ని ప్రమాదం సంభవించినా దానిని తక్షణమే నియంత్రించగలిగే పరిస్థితి ఉండాలి. ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర సాధ్యాసాధ్యాల నివేదిక సిద్ధం చేశారా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ పనులను బహిరంగ టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ప్రైవేటు కాంట్రాక్టర్‌కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

